*భారత్ సైనిక దినోత్సవం*
*సైనిక దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15 వ తేదీన జరుపుకుంటారు.*
*ఫెరల్ మార్షల్ కోడన్దేరా ఏం. కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ తరువాత భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా, జనవరి 15, 1949 న ఎన్నికైయ్యారు. స్వతంత్ర భారత సైన్యాధిపతిగా కె.ఎం. కరియాప్ప భాద్యతలు స్వీకరించిన రోజుకు గుర్తుగా ప్రతి ఏట సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.*
*దేశంలోని అన్ని ప్రధాన సైనిక కేంద్రాల వద్ద ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమాన్ని న్యూ ఢిల్లీ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తారు.*
*సైనిక దినోత్సవం దేశమును మరియు దాని పౌరులను కాపాడటానికి వారి జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను అభినందించటానికి ఒక రోజును సూచిస్తుంది.*
*దేశ పరిరక్షణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన భారత జవానుల ధైర్య సాహసాలను స్మరిస్తూ వారికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తారు.*