సంఘటనలు
1896: అమెరికాకు చెందిన
డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క
బుల్లెట్‌ను ఇలా తీశాడు.
1908 – చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను
ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
1917: మొదటి ప్రపంచ యుద్ధం -- Zimmermann
Telegram ప్రచురింపబడింది.
1970: బోయింగ్ 747 విమానం
ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.
1987: ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి
పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
1995: జపాన్ లోని కోబే నగరంలో పెను భూకంపం
వచ్చి 5,092 మంది చనిపోయారు
2010: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది
మంది మృతిచెందారు.
జననాలు
1863: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు (మ.1902).
1895: యల్లాప్రగడ సుబ్బారావు, ప్రముఖ వైద్య శాస్త్రవేత్త (మ.1948).
1917: మహర్షి మహేశ్ యోగి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు (మ.2008).
1936: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్
ముఖ్యమంత్రి. (మ.2016)
1940: ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
1949: గుండప్ప విశ్వనాథ్, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.
1962: రిచీ రిచర్డ్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1964: జెఫ్ బెజోస్, అమెజాన్.కాం
యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన
కార్యనిర్వాహణా అధికారి మరియు అమెజాన్.కాం పాలక మండలి సభాపతి.
1991: ద్రోణవల్లి హారిక, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
మరణాలు
1989: చెళ్ళపిళ్ళ సత్యం, తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకుడు (జ.1933).
1992: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్
గంధర్వ (జ.1924).
2004: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ
హెగ్డే (జ.1926).
2005: అమ్రీష్ పురి, ప్రముఖ
భారత సినిమా నటుడు (జ.1932).
2015: వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు
(జ.1932).
జాతీయ / అంతర్జాతీయ
దినోత్సవాలు
🔻జాతీయ యువజన దినోత్సవం (స్వామీ వివేకానంద జయంతి)
జాతీయ యువజన దినోత్సవం
భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ
దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ
యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామీ వివేకానంద జవవరి 12, 1863 న జన్మించాడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత
ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే
ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే
కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత
శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము
చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ
మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన
అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య
దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును
షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893
లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని
ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ
మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి
ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ
దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది.
*💲కెరటాలు నాకు ఆదర్శం.
పడినందుకు కాదు.. పడి లేచినందుకు’ : స్వామి వివేకానంద...💲*
*🔰స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 — జూలై 4, 1902), (బెంగాలీలో ‘షామీ బిబేకానందో’) ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి.
ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ
శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు.
హిందూ తత్వ చరిత్ర, భారతదేశ
చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.*
♦️స్వామి వివేకానంద సూక్తులు🔽🔽
*1.రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి
లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.*
*2. నీ వెనుక ఏముంది…ముందేముంది…
అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.*
*3. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి
ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ
తిరస్కరించండి.*
*4. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం
చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.*
*5. జీవితంలో ధనం కోల్పోతే కొంత
కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.*
*6. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు
గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.*
*7. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని
కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.*
*8. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం
తుది మెట్టు కాదు!!!*
*9. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర
బలహీనలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం
మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.*
*10. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు
విశ్రమించకండి.*