సంఘటనలు
1929:
మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు
సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
1947:
అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు
అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
2009:
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
జననాలు
- 1812:
బాలశాస్త్రి జంబేకర్, భారతీయ సంఘ సంస్కర్త.
- 1867:
బయ్యా నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు,
వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది మరియు దాత
- 1910:
G. N. బాలసుబ్రహ్మణ్యం, భారత కర్ణాటక సంగీత
విద్వాంసుడు. (మ.1960)
- 1932:
బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ప్రముఖ సంగీత
విద్వాంసులు మరియు రేడియో కళాకారులు.
- 1936:
జి. మునిరత్నం నాయుడు, సామాజిక కార్యకర్త,
పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1959:
కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత
గొప్ప ఆల్రౌండర్.
- 1966:
ఎ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకులు.
మరణాలు
- 1847:
త్యాగయ్య, ప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767)
- 1852:
లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త మరియు
బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809)
- 1884:
గ్రెగర్ మెండల్, జన్యు శాస్త్రములో జన్యు
భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
- 1919:
థియోడర్ రూజ్వెల్ట్, అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858)
- 1949:
చింతా వెంకట్రామయ్య, కూచిపూడికి యక్షగాన
సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
- 1976:
యనారాయణ శాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత,
కవి మరియు శతావధానులు.
- 1994:
బాడిగ వెంకట నరసింహారావు, ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
- 2009:
జీ.ఎం.షా, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
- 2011:
ఎస్. టి. జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత.
(జ.1922)
- 2013:
మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు,
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
- 2014:
ఉదయ్ కిరణ్, తెలుగు మరియు తమిళ
భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
- 2017:
ఓం పురి, ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950)