1.హావభావాది
సంయుక్తమైన నృత్యము,
2.నానావిధ
వాద్యముల నిర్మాణమందును, వాదనమందును నేర్పరితనము,
3.స్త్రీపురుషులకు
వస్త్రాలంకార యోజనమును గావించుట,
4.దారుశిలాదులచే
వివిధాకృతులను నిర్మించుట,
5.శయ్యాస్తరణ
యోగము-పుష్పగ్రథనము,
6.ద్యూతాద్యనేక
క్రీడలచే జనుల నానందింపజేయుట,
7.వివిధాసనములు
తోడి రతిజ్ఞానము [ఈ యేడు కళలు గాంధర్వవేదమున చెప్పబడినట్టివి],
8.మకరందాసవము-
మద్యము మున్నగువానిని సిద్ధము చేయునేర్పు,
9.బాణములంగములందు
గాడినచో వానిని తీసి నరములందేర్పడు వ్రణములను వ్యథ లేకుండ బాగుచేయుటలో నేర్పు,
10.హింగ్వాధి రససంయోగముచే అన్నాదులను వండుట,
11.వృక్షములకు పుష్పము గలుగజేయుట, మొక్కలు వేయుట,
వానిని పోషించుట-వీనియందలి నేర్పు,
12.పాషాణములు, ధాతువులు వీనిని భస్మముగావించు నేర్పు,
13.చెఱకుపానకముచే ననేక ప్రకారములుగ పంచదార మొదలగు వానిని చేయుట,
14.స్వర్ణాది ధాతువులను, ఓషధులను మిశ్రణము చేయునేర్పు,
15.మిశ్రితములగు ధాతువులను వేఱు చేయు నేర్పు,
16.ధాత్వాదుల యన్యోన్యసంయోగము కంటే పూర్వమందగు ధాత్వాది జ్ఞానము,
17.క్షారముల నితరములనుండి వేఱు చేయు నేర్పు [ఈ పదియు నాయుర్వేదమున చెప్పబడిన
కళలు],
18.శస్త్రసంధానము, శస్త్ర విక్షేపము, ఆలీఢాది పదన్యాసము-వీని నెఱుగుట,
19.శరీరసంధులయందు పొడచుట, ఆకర్షించుట మొదలగువానిచేనగు
మల్లయుద్ధము,
20.అభిలక్షిత దేశమున యంత్రాద్యస్త్రములను ప్రయోగించుట,
21.వాద్య సంకేతమున వ్యూహాది రచన,
22.గజాశ్వరథగతులతో యుద్ధమొనర్చుట [ఈ యైదు ధనుర్వేదమున చెప్పబడిన కళలు],
23.నానావిధములగు నాసన ముద్రాదులచే దేవతలను సంతోషపరచుట,
24.సారథ్యము-గజాశ్వాది గమన శిక్షణము,
25.మన్ను, కఱ్ఱ, ఱాయి, స్వర్ణాది ధాతువులు-వీనిచే కుండలు మొదలగు వానిని చేయుట [ఇవి వేర్వేఱ
నాలుగు కళలు],
26.మన్ను, కఱ్ఱ, ఱాయి, స్వర్ణాది ధాతువులు-వీనిచే కుండలు మొదలగు వానిని చేయుట [ఇవి వేర్వేఱ
నాలుగు కళలు],
27.మన్ను, కఱ్ఱ, ఱాయి, స్వర్ణాది ధాతువులు-వీనిచే కుండలు మొదలగు వానిని చేయుట [ఇవి వేర్వేఱ
నాలుగు కళలు],
28.మన్ను, కఱ్ఱ, ఱాయి, స్వర్ణాది ధాతువులు-వీనిచే కుండలు మొదలగు వానిని చేయుట [ఇవి వేర్వేఱ
నాలుగు కళలు],
29.చిత్రాదులను లిఖించుట,
30.చెఱువు, బావి, మేడ, సమభూమి-వీనిని నిర్మించుట,
31.గడియారము మొదలగు యంత్రములను, వీణా మృదంగాది
వాద్యములను చేయు నేర్పు,
32.సూక్ష్మ, మధ్యమ, గాఢములగు వర్ణ
సంయోగములచే వస్త్రముల నద్దుట,
33.అగ్ని, జలము, వాయువు-వీని
సంయోగ నిరోధాదుల చేయు క్రియ,
34ఓడలు,
రథములు మొదలగు యానములను చేయుట,
35.సూత్రములను, రజ్జువులను చేయుట,
36.వస్త్రములు నేయుట,
37.రత్నములకు రంధ్రములు వేయుట, వాని సదసద్జ్ఞానము,
38.స్వర్ణాదుల యథార్థ స్వరూపము నెఱుగుట,
39.కృత్రిమ స్వర్ణ రత్నాదులను చేయుజ్ఞానము,
40.స్వర్ణాదులచే నలంకారములను చేయుట-లేపాది సత్కారము,
41.చర్మములను మృదువుగా చేయు నేర్పు,
42.పశువుల శరీములనుండి చర్మమును తీయు నేర్పు,
43.పాలు పితుకుట మొదలుకొని నేయి కాచుట వఱకు గల వివిధ ప్రక్రియల నెఱుగుట,
44.అంగీలు (కంచుకములు) మొదలగు వానిని కుట్టుటయందు నేర్పు,
45.నీటిలో ఈదుట,
46.ఇంటియందు వాడుకొను పాత్రలను శుద్ధి చేయు నేర్పు,
46.వస్త్రములను శుభ్రపరచు నేర్పు,
48.క్షురకర్మ,
49.నువ్వులు మొదలగువానినుండి నూనె తీయుట,
50.దున్నుట మొదలగు వానిని గూర్చిన జ్ఞానము,
51.వృక్షాద్యారోహణ జ్ఞానము,
52.చిత్తానుకూలముగ పరిచర్య చేయునేర్పు,
53.గడ్డి, వెదుళ్ళు వీనిచే పాత్రములను చేయుట,
54.కాచపాత్రాదులను చేయు నేర్పు,
55.నీరు కట్టుట యందును, తీయుటయందును నేర్పు,
56.లోహాదులచే శస్త్రాస్త్రములను చేయు నేర్పు,
57.ఏనుగులు, గుఱ్ఱములు, ఎద్దులు,
ఒంటెలు వీనిపై వేయు జీనును కుట్టు నేర్పు,
58.శిశువులను సంరక్షించు నేర్పు,
59.శిశువుల నెత్తికొని యాడించు నేర్పు,
60.అపరాధిని యథాపరాధముగ దండించు నేర్పు,
61.నానాదేశముల వర్ణములను చక్కగా వ్రాయు నేర్పు,
62.తాంబూలపు పట్టీలను కట్టు నేర్పు,
63.ఆదానము (ఆశుకారిత్వము),
64.ప్రతిదానము (చిరక్రియ).