(పసిబిడ్డను ముందు కూర్చుండబెట్టుకుని యీ క్రింది పదము చెప్పుతూ చివరకు
కళ్లలో "ఉఫ్" అని ఊదితే బిడ్డ కళ్లు మూస్తుంది. "అదుగో
జడిసినావులే" అని గేలి చేస్తారు. అందాకా "జడవను, జడవను"
అని బదులు చెప్పుతుంది.)
నూకలు పెడతాను మేకలు గాస్తావా? కాస్తా!
పెద్దపులివస్తే జడవవుగద? జడవను!
చిఱతపులివస్తే జడవవుగద? జడవను!
ఎలుగుబంటివస్తే జడవవుగద? జడవను!
సివంగివస్తే జడవవుగద? జడవను!
తోడేలువస్తే జడవవుగద? జడవను!
అన్నింటికీ "జడవను" అని చెప్పును.
నే వస్తే జడవవు కద?
(ఇది చెప్పి కళ్లలో ఊదవలెను;
బిడ్డ కన్నులు మూసుకొనును.)
జడిసినావులే అమ్మా జడిసినావు!!