అ అంటే అమ్మ అందరికీ ఉన్నాది అమ్మ
అమ్మ లేకపోతే లేదు నీకు జన్మ
ఆ అంటే ఆవు అమ్మ వంటిదె ఆవు
ఆవు తనబిడ్డకే కాకుండా బిడ్డలకీ
ఇస్తుంది పాలు
ఇ అంటే ఇల్లు ఇల్లు ఎండకి ఎండి
వానకి తడిసి
చలికి వనికి ఎండ,వాన,చలి నుండి మనల్ని కాపాడేదె ఇల్లు
ఉ అంటె ఉడుత వారధి కట్టడంలో
రామునికి అందించింది సాయం
రాముని మెప్పు పొందింది చిట్టి ఉడత
ఊ అంటే ఊయల ఊయల తాను వేలాడుతూ
బరువుమోస్తూ పాపాయికి
హాయినిస్తోంది ఊయల
లోకంలో అన్నీ ఇతరులకోసమే తాము
బ్రతుకుతూ
ఇతరులకి హాయినిస్తున్నాయి
మనిషిగాపుట్టిన మనం
ఇతరులకి ఏమైనా మనం
ఉపయోగపడుతున్నామా!!!!!!!!!!!!
ఒక్కసారి ఆలోచించండి మనిషిగా బ్రతకండి
ఇతరులకి సహాయ పడండి