పువ్వులు అందం
పువ్వులు అందం
నవ్వులు అందం
నవ్వులొలికే బాలలు
ఎంతో అందం
తోటలు అందం
బాటలు అందం
బాటల మలుపు కోటలు
ఎంతో అందం ||పువ్వులు అందం||
చెరువులూ అందం
తరగలూ అందం
తరగలపైన కలువలు
ఎంతో అందం ||పువ్వులు అందం||
నేల అందం
నింగి అందం
నింగిపైన చంద్రుడు
ఎంతో అందం ||పువ్వులు అందం||