స్వాగతమండీ స్వాగతం
చిన్నిపిల్లల స్వాగతం
మృదువుగ ఇచ్చే స్వాగతం
ముద్దులుఒలికే స్వాగతం ।స్వాగతమండీ ।
చిన్ని పిల్లలమొచ్చినాము
ఆటలు బాగా ఆడెదము
పాటలు కూడా పాడెదము
ఆటలు పాటలతో మేము
ఆనందముగా ఉండెదము ।స్వాగతమండీ ।
చాచా నెహ్రూ మా నేస్తం
ఎర్ర గులాబి మాకిష్టం
శాంతి కపోతం ఆదర్శం
హరివిల్లే మా ఆనందం ।స్వాగతమండీ