అంశం: బాలసాహిత్యం.
' క ' ప్రారంభాక్షర గేయం
కమలా..విమలా..రారే !!
కవితా ..వనితా… రారే !!
కలసి ఉందాం…. రారే..!!
కలిసే తిందాం…..రారే..!!
కమ్మని పాటలు పాడేద్దాం!
కలిసి ఆటలు ఆడేద్దాం!
కలహమన్నదే లేకుండా,
కన్నవారిని మురిపిద్దాం !!
కలిమి, బలిమి ఏదైనా
కలుపుగోలుగా ఉందాము,
కసురు,విసురు లేకుండా
కలలను నిజం చేద్దాము!!
స్వీయరచన:
శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి
హైదరాబాద్.