ఏనుగమ్మ ఏనుగు ఎంత పెద్దదమ్మ ఏనుగు - వరల్డ్ ఎలిఫెంట్ డే 🐘
🐘పిల్లలను ‘ఇ’ ఫర్ అని అడగ్గానే ‘ఎలిఫెంట్’ అని ఠక్కున చెబుతారు. ఆకారంలో పెద్దగా ఉన్నా
పిల్లలు బాగా ఇష్టపడే జంతువు ఏనుగు. భూమిపై నివసిస్తున్న అతి పెద్ద క్షీరదం ఏనుగు.
మరి ఈ రోజు ‘వరల్డ్ ఎలిఫెంట్ డే’జరుపుకుంటున్న సందర్భంగా ఏనుగు గురించి
విశేషాలు తెలుసుకుందామా!
🐘వరల్డ్ ఎలిఫెంట్ డే🐘
🐘ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఏనుగులు ఎక్కువ కనిపిస్తాయి.
ఆసియా ఖండంలో కనిపించే ఏనుగులతో పోల్చితే ఆఫ్రికా ఏనుగులు పెద్దగా ఉంటాయి.
🐘పెద్ద ఏనుగులు 2.5 నుంచి 6 టన్నుల వరకు బరువుంటాయి. పిల్ల ఏనుగులు సుమారు 90 కేజీల బరువుతో
పుడతాయి.ఏనుగులు గుంపుగా ప్రయాణిస్తాయి. ఒక గుంపులో కనీసం 10 ఏనుగులుంటాయి. ఆ
గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది.ఇవి మొక్కలు, కూరగాయలు, గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి. మాంసం ముట్టవు. ఏనుగు రోజులో 16 గంటలు తినడానికే
కేటాయిస్తుంది.పెద్ద ఏనుగులు 130 నుంచి 250 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతిరోజూ 150 నుంచి 190 లీటర్ల నీటిని
తాగుతాయి. ఈత కొట్టడాన్ని ఇష్టపడతాయి. అలాగే రోజూ రెండు గంటలు నిద్రపోతాయి.ఏనుగు
అనగానే తొండం గుర్తుకొస్తుంది. ఈ తొండం ముక్కుగానూ పనిచేస్తుంది. ఏనుగు ఒక పదార్థం
సైజును, ఉష్ణోగ్రతను
తొండంతో గుర్తిస్తుంది. ఏనుగు తొండం రెండు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. లక్షకు
పైగా కండరాలతో ఇది నిర్మితమై ఉంటుంది. ఎముకలు ఉండవు.ఏనుగు 60 నుంచి 70 ఏళ్ల పాటు
జీవిస్తుంది. గంటకు 45 కి.మీ వేగంతో పరుగెత్తగలదు.ఏనుగులు ఒక రకమైన
శబ్దాలను చేయడం ద్వారా సంభాషించుకుంటాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయింది.ఠి ఏనుగు
గర్భధారణ కాలం 22 నెలలు ఉంటుంది. ఇతర ఏ జంతువు గర్భధారణ కాలం ఇంత ఉండదు.ఏనుగు చెవులు
సంక్లిష్టమైన రక్తనాళ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇవి ఉష్ణోగ్రతను
నియంత్రిస్తాయి.జంతువులలో తెలివైనది ఏనుగు. దీని మెదడు బరువు 5 కేజీల వరకు
ఉంటుంది. మరే జంతువూ ఇంత బరువున్న మెదడు కలిగి లేదు.ఏనుగుల్లో వృషణాలు శరీరం లోపల
ఉంటాయి. అంతేకాకుండా భూమిపై మరే జంతువుకూ లేనంత వాసనను గ్రహించే శక్తి ఏనుగులకు
ఉంటుంది.ఏనుగులకు పొడవైన దంతాలుంటాయి. ఇతర జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి, ఆహారం కోసం ఈ
దంతాలను ఉపయోగించుకుంటాయి.